: మోదీ పర్యటనలో తెలుగు అధికారి కీలక భూమిక!
ప్రధాని నరేంద్ర మోదీ చైనాతో పాటు మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో జరిపిన పర్యటన ద్వారా ఆయా దేశాలతో కీలక ఒప్పందాలు కుదిరాయి. ప్రధానంగా చైనాతో వ్యాపార, వాణిజ్యాల్లో లక్షల కోట్ల రూపాయల మొత్తంలో ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఈ కీలక ఒప్పందాలు కుదరడంలో తెలుగు అధికారి ఒకరు కీలక భూమిక పోషించారు. చైనాలోని భారత రాయబార కార్యాలయంలో ఉప రాయబారిగా పనిచేస్తున్న బి.బాలభాస్కర్ మోదీ పర్యటనలో కీలక పాత్ర పోషించారు. ఏపీలోని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన బాలభాస్కర్ ఐఎఫ్ఎస్ అధికారిగా చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. ప్రస్తుతం చైనాలో భారత ఉప రాయబారిగా ఆయన భారత్-చైనా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.