: యువరాజ్ చేసిన ఒక్కో పరుగు ఖరీదు రూ. 8 లక్షలు!
14 మ్యాచ్ లు, 248 పరుగులు, హైయ్యస్ట్ 57, సరాసరి 19.07, స్ట్రయిక్ రేటు 118.09... ఇవి యువరాజ్ సింగ్ ఐపీఎల్ 8వ సీజన్ గణాంకాలు. యువరాజ్ ను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ డేర్ డెవిల్స్ వెచ్చించిన సొమ్ము రూ. 16 కోట్లు. అంటే, ఈ ఐపీఎల్ లో యువరాజ్ చేసిన ఒక్కో పరుగుకు ఆయనకు లభించిన మొత్తం దాదాపు రూ. 8 లక్షలు. ఈ సీజన్లో చేసిన పరుగులకు, ఫ్రాంచైజీ కొనుక్కున్న రేటుతో పోలిస్తే ఇంత అధిక మొత్తం దక్కింది ఒక్క యువరాజ్ కే. వన్డే క్రికెట్ కెరీర్లో తొలి మ్యాచ్ నుంచే రాణించిన యువరాజ్ ఎన్నో మార్లు మ్యాచ్ విన్నర్ గా నిలిచిన సందర్భాలు మనకు తెలుసు. కానీ, ఐపీఎల్ పోటీల్లో మాత్రం ఒక్క సీజన్లోనూ రాణించలేకపోయాడు. గత ఎనిమిదేళ్లలో ఏ సంవత్సరమూ అతని స్కోరు 400 పరుగులు దాటలేదు. యువరాజ్ తో పోలిస్తే చాలా తక్కువ తీసుకున్న ఆటగాళ్లు ఎంతో మెరుగ్గా ఆడి రాణించారు. ఇక వచ్చే సంవత్సరం సీజన్ పరిస్థితి ఎలా ఉంటుందో?