: ఎమ్మెల్సీ ఎన్నికకు వైసీపీ అభ్యర్థి నామినేషన్
ఏపీ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు వైఎస్సీర్సీపీ అభ్యర్థి డీసీ గోవింద్ రెడ్డి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రెటరీకి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఏపీలో మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 23 గడువు విధించారు. గోవింద్ రెడ్డి గతంలో రోడ్డు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ గా విధులు నిర్వర్తించారు. తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం 2004లో బద్వేలు ఎమ్మెల్యేగా గెలుపొందారు.