: హోటల్ కెళ్తే షాక్, ఫోన్ పట్టుకుంటే షేక్... మరింతగా పెరగనున్న అన్ని రకాల బిల్లులు
జూన్ 1 తరువాత రెస్టారెంటుకెళ్లి భోజనం చెయ్యాలంటే పర్సులో ఇంకాస్త దండిగా డబ్బు పెట్టుకోవాలి. ఫోన్ మాట్లాడాలంటే అధికంగా చెల్లించాలి. బీమా చేయించుకోవాలన్నా, ఏదైనా మాల్ కు వెళ్లి గృహోపకరణాలు కొనాలన్నా, ఇంకేం చెయ్యాలన్నా అధికంగా చెల్లించక తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే 14% సేవా పన్నును జూన్ నుంచి అమలు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఎడ్యుకేషన్ సెస్ సహా సేవా పన్ను 12.36 శాతంగా అమలవుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర సేవలపైనా కొత్త పన్నులు అమలు కానున్నాయి. దీంతో పెట్రోలు ధర కూడా స్వల్పంగా పెరగనుంది. వ్యాపార ప్రకటనలు, విమాన ప్రయాణం, ఆర్కిటెక్చర్ సేవలు, ఈవెంట్ మేనేజ్ మెంట్, క్రెడిట్ కార్డు సేవలు వంటివాటిపైనా అధికంగా చెల్లించాల్సిందే. మొత్తం మీద నెలకు రూ. 15 వేలను ఖర్చు చేసేవారిపై మరో రూ. 225 వరకూ సేవా బాదుడు పడనుంది.