: టీమిండియా కెప్టెన్ గా సురేష్ రైనా?... బంగ్లాదేశ్ టూర్ కు జట్టు ఎంపిక నేడే
బంగ్లాదేశ్ టూర్ కు టీమిండియా జట్టును బీసీసీఐ నేడు ఎంపిక చేయనుంది. ఈ టూర్ కు పెద్దగా ప్రాధాన్యమివ్వని బీసీసీఐ ధోనీ, కోహ్లీలకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, టీమిండియాకు నాయకత్వం వహించే గొప్ప అవకాశం సురేష్ రైనాకు దక్కనుందని సమాచారం. ఈ సిరీస్ లో బంగ్లాదేశ్ తో టీమిండియా ఒక టెస్టుతో పాటు, మూడు వన్డేలను ఆడనుంది.