: ఢిల్లీలో కేంద్ర మంత్రులతో మోదీ భేటీ... ఏడాది ప్రభుత్వ పాలనపై సమీక్ష


ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసం 7 రేస్ కోర్స్ రోడ్ లో కేంద్ర సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు. ఈ నెల 26కు మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం అవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్ డీఏ ప్రభుత్వ ఏడాది పాలనపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, సుష్మాస్వరాజ్ హాజరయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా హాజరయ్యే అవకాశముందని సమాచారం. గతరాత్రే మూడు దేశాల పర్యటన ముగించుకుని మోదీ స్వదేశానికి తిరిగివచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వం తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా భారీగా వేడుక చేయాలని బీజేపీ ప్రణాళిక చేస్తున్నట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News