: కమల్ కు నష్టం ... రజనీ తనయకు లాభం!


ఈ నెలారంభంలో కమల్ హాసన్ నటించిన 'ఉత్తమ విలన్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా, కలెక్షన్ల సునామీని సృష్టించడంలో మాత్రం విఫలమైంది. దానికి, విడుదల ఆలస్యం కావడమూ కారణమేనని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఈ సినిమా వచ్చి రెండు వారాలు దాటగా, ఇప్పటివరకూ పెట్టిన పెట్టుబడి తిరిగి రాలేదని తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 1వ తేదీన చిత్రాన్ని విడుదల చేయాలని భావించగా, ఆర్థిక వ్యవహారాల కారణంగా 2వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, కమల్ హాసన్ చిత్రానికి ఏర్పడ్డ నష్టం రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా ధనుష్ కు వరంగా మారి కాసులు కురిపించింది. మే 1న ఆమె దర్శకత్వం వహించి నిర్మించిన 'వెయ్ రాజా వెయ్' చిత్రం విడుదలైంది. ఆ రోజు కమల్ సినిమా చూసేందుకు థియేటర్లకు వచ్చిన వారంతా ఈ సినిమా చూడాల్సి వచ్చింది. దీంతో పాటు ఉత్తమ విలన్ కోసం బుక్ చేసుకున్న థియేటర్లలో సైతం ఇదే చిత్రాన్ని ప్రదర్శించాల్సి వచ్చింది. దీంతో లో బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన 'వెయ్ రాజా వెయ్' తొలిరోజున రూ. 3.3 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిందని ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ వివరించారు. అలా కమల్ ఖాతాలోకి వెళ్లాల్సిన డబ్బు ఇలా ఐశ్వర్యకు చేరింది.

  • Loading...

More Telugu News