: సల్మాన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కాశ్మీరీలు... ఇదేం పనంటున్న టూరిస్టులు!


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'బజ్రంగీ భాయిజాన్' చిత్రం షూటింగ్ కాశ్మీర్ లోని సోనామార్గ్, పహల్ గావ్ ప్రాంతంలో జరుగుతుండగా, అక్కడి స్థానికులు, టూరిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి టూరిస్టులు వెళ్లేందుకు భద్రతా దళాలు అంగీకరించడం లేదు. దీంతో కాశ్మీరు అందాలను తిలకించాలని వ్యయ ప్రయాసలతో వచ్చిన వందలాది మంది టూరిస్టులు తీవ్ర నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం టూరిస్టులు వస్తే జరిగే వ్యాపారంతో పొట్ట నింపుకునే సోనామార్గ్ ప్రజలకు గత పది రోజులుగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీంతో వారంతా ఉపాధిని కోల్పోయారు. కాశ్మీర్లో అత్యంత అందమైన ప్రాంతాలు ఇక్కడే ఉంటాయి. అదే ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. గత పది రోజులుగా సుమారు 10 వేల మంది ప్రజలకు ఎలాంటి పనీ లేకుండా పోయిందని తెలుస్తోంది. పర్యాటకులు సైతం ఆ ప్రాంతాలకు చేరే దారిలేక ఇదేం పనంటూ విమర్శిస్తున్నారు. ఉపాధి కోల్పోయిన వారంతా, ప్రభుత్వం కల్పించుకోవాలని మొరపెట్టుకుంటున్నారు. దీంతో పర్యాటకులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని చిత్ర సిబ్బందికి ప్రభుత్వం సూచించింది.

  • Loading...

More Telugu News