: టీఆర్ఎస్ నేత కేకేతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి భేటీ


టీఆర్ఎస్ నేత కే.కేశవరావుతో ఆయన నివాసంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఈ ఉదయం భేటీ అయ్యారు. కొన్ని రోజుల్లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐదో స్థానం దక్కించుకోవాలని టీఆర్ఎస్ అనుకుంటోంది. ఈ క్రమంలో కేకే ఇంటికి జానా వెళ్లడం చర్చనీయాంశమైంది. అంతేగాక తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. ఈ సాయంత్రం ఆ అభ్యర్థి పేరును సాయంత్రం ప్రకటించనున్నారు. మరోవైపు టి.కాంగ్రెస్ లో ఒక్క సీటు కోసం దాదాపు 40 మంది పోటీపడుతున్నట్టు సమాచారం. అందుకోసం ఎవరికి వారు సిఫారసులు, లాబీయింగ్ లు చేసుకుంటున్నారట.

  • Loading...

More Telugu News