: ‘మంచు’వారి పెళ్లి వేడుకకు చంద్రబాబు హాజరు... నూతన వధూవరులకు దీవెనలు


టాలీవుడ్ యువ హీరో మంచు మనోజ్ కుమార్, ప్రణతిల వివాహ వేడుకకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హాజరయ్యారు. మాదాపూర్ లోని హైటెక్స్ లో కాసేపటి క్రితం జరిగిన ఈ పెళ్లికి తన భార్య భువనేశ్వరితో కలిసి వచ్చిన చంద్రబాబు నూతన వధూవరులను ఆశీర్వదించారు. తమను ఆశీర్వదించిన చంద్రబాబుకు మనోజ్ దంపతులు పాదాభివందనం చేశారు. అనంతరం వివాహ వేడుకకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే, కాంగ్రెస్ పార్టీ నేత సుబ్బిరామిరెడ్డిలతో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు పార్టీలను పక్కనబెట్టి నవ్వుతూ, తుళ్లుతూ కనిపించారు.

  • Loading...

More Telugu News