: శ్రీనిధి కన్నుమూత... దిగ్భ్రాంతికి గురైన జూనియర్ ఎన్టీఆర్
టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని చిన్నారి శ్రీనిధి కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచింది. హైాదరాబాదులో కూకట్ పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలిక మరణించింది. బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్న శ్రీనిధిని ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించారు. ప్రాణాంతక వ్యాధితో చికిత్స పొందుతూనే తనకు జూనియర్ ఎన్టీఆర్ ను చూడాలని ఉందని శ్రీనిధి తెలిపిన సంగతి తెలిసిందే. బాలిక గురించి అభిమానుల ద్వారా తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ బాలికను పరామర్శించి, త్వరలో కోలుకోవాలని దీవించి వచ్చాడు. అయితే ఆ బాలిక నేటి ఉదయం కన్నుమూసిందని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యాడు.