: ఆ తర్వాత మరో టెక్నిక్ నేర్పిస్తానని చెప్పా: అక్రమ్
పాకిస్థాన్ స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్ ఇటీవల ముంబైలో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ కు కిటుకులు నేర్పిన సంగతి తెలిసిందే. వాంఖెడే స్టేడియంలో సచిన్ తన కుమారుడిని నెట్స్ వద్ద ఉన్న అక్రమ్ చెంతకు తీసుకువచ్చాడు. అప్పుడు అర్జున్ కు అక్రమ్ ఫిట్ నెస్, బంతి గ్రిప్ పై పలు సలహాలు ఇచ్చాడు. ఈ విషయమై తాజాగా అక్రమ్ మాట్లాడుతూ... సచిన్ కొడుకులో క్రికెట్ తపన బాగా ఉందని కితాబిచ్చాడు. లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్జున్ లో చాలా టాలెంట్ ఉందని అన్నాడు. మణికట్టును ఉపయోగించడంపై అతడికి పలు సలహాలు ఇచ్చానని చెబుతూ... ముఖ్యంగా, కుడిచేతివాటం ఆటగాడికి బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతిని లోపలికి స్వింగ్ చేయడం ఎలాగో చెప్పానని తెలిపాడు. ఈ టెక్నిక్ ను మూడు నెలల పాటు ప్రాక్టీసు చేయమని చెప్పానని వెల్లడించాడు. దాన్ని సాధన చేసిన తర్వాత, కుడిచేతివాటం ఆటగాళ్లకు బౌలింగ్ చేస్తున్నప్పుడు అవుట్ స్వింగ్ రాబట్టడం ఎలాగో నేర్పిస్తానని ప్రామిస్ చేశానని వివరించాడు.