: లాడ్జ్ లో పట్టుబడ్డ సినీ నిర్మాత
సినీ నిర్మాత లాడ్జిలో పట్టుబడడం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా బాపట్లలోని లాడ్జిలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 17 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సినీ నిర్మాత కొరటాల సందీప్, టీడీపీ నేత మువ్వా హరీశ్ ఉన్నారు. కాగా, పేకాట రాయుళ్ల నుంచి పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కాగా, ఇదే లాడ్జిలో వ్యభిచారం చేస్తున్న నలుగురు విటులు, ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.