: తనిఖీలు చేసిన అధికారుల్ని ఉతికేసిన చిల్లర వ్యాపారులు


ఆంధ్రప్రదేశ్ లో సిండికేట్ వ్యాపారం మూడుపువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. మద్యం, ఇసుక ర్యాంపులు, రైస్ మిల్లులు, కిరాణా, పండ్ల వ్యాపారం... ఇవే కాకుండా తాజాగా రైల్వే స్టేషన్లలో చిల్లర వ్యాపారులు కూడా సిండేకేట్ గా అవతరించారు. కృష్ణా జిల్లాలో తనిఖీల కోసం వచ్చిన అధికారులపై రైల్వే స్టేషన్ లోని చిల్లర వ్యాపారులంతా కలిసి దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. గుడివాడలోని రైల్వే స్టేషన్ లో వ్యాపారులంతా అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ రైల్వే అధికారులకు ఫిర్యాదులందాయి. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రైల్వే అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల ఫిర్యాదులు వాస్తవమని నిర్ధారించారు. దీంతో చిల్లర వ్యాపారులంతా ఏకమై తనిఖీలు నిర్వహించిన అధికారులను ఉతికేశారు. దీంతో వారికి గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని విజయవాడ తరలించారు.

  • Loading...

More Telugu News