: ఏ దేశస్తుడినైనా విచారించే సత్తా మాకుంది... ఎంతటివారినైనా వదలం: ఏపీ డీజీపీ


ఏపీ డీజీపీ జేవీ రాముడు మీడియాతో మాట్లాడారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్న చైనా జాతీయుడు యియాంగ్ పింగ్ ను విచారిస్తున్నట్టు తెలిపారు. ఏ దేశస్తుడినైనా విచారించే హక్కు తమకు ఉందని ఉద్ఘాటించారు. ఎర్రచందనం అక్రమరవాణాతో సంబంధం ఉందని తేలితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. పింగ్ ను ఏపీ స్పెషల్ పార్టీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతనితో పాటు శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News