: ఇప్పుడే టీమిండియా కోచ్ గా పనిచేసే ఉద్దేశం లేదు: జస్టిన్ లాంగర్


తనకు ఇప్పుడే టీమిండియా కోచ్ గా పనిచేసే ఉద్దేశం లేదని ఆస్ట్రేలియా జట్టు మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్(డబ్యూఏసీఏ)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో లాంగర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ జట్టుకు కోచ్ గా ఇప్పుడే పనిచేసే ఉద్దేశం లేదని అన్నాడు. అంతర్జాతీయ కోచ్ గా పనిచేయాలని ఉన్నా, ఇదే సరైన సమయం అని తాను భావించట్లేదని లాంగర్ తెలిపాడు. మరికొంత కాలం వేచి చూడాలని అనుకుంటున్నట్టు లాంగర్ చెప్పాడు. టీమిండియా కోచ్ గా డంకన్ ఫ్లెచర్ పదవీకాలం ముగుస్తుండడంతో అతని స్థానంలో జస్టిన్ లాంగర్ ను నియమిస్తారంటూ జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లాంగర్ పై విధంగా స్పందించాడు. దీంతో టీమిండియా కోచ్ గా ఎవరు రానున్నారన్న సస్పెన్స్ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News