: అన్నదమ్ముల అనుబంధాన్ని చాటిన పాటకు 8 కోట్ల హిట్స్
అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని చాటిన పాటకు యూట్యూబ్ లో అత్యంత ఆదరణ లభిస్తోంది. స్వీడన్ డీజే అవిసి రూపొందించిన 'హే బ్రదర్' పాటను 2013 అక్టోబర్ లో విడుదల చేసిన నాటి నుంచి నేటి వరకు వన్నె తరగలేదు. 2013లో అవిసి దీనికి సంబంధించిన వీడియో ఆల్బమ్ ను విడుదల చేశారు. వియత్నాం యుద్ధం నేపథ్యంలో తీసిన ఈ పాటలో అన్నదమ్ముల అనుబంధాన్ని చూపుతారు. పాట మొత్తం ఇద్దరు అన్నదమ్ముల మధ్యే సాగుతుంది. ఈ పాటను 8 కోట్ల మందికిపైగా వీక్షించగా, 6 లక్షల మంది లైక్ చేయడం విశేషం.