: 8 నెలల తరువాత ఈ నెల 22న తొలిసారి బయటకు వస్తున్న జయలలిత


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత ఈ నెల 22న ప్రజల్లోకి రానున్నారు. ఎనిమిది నెలల తరువాత తొలిసారిగా అమ్మ దర్శనమివనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతేడాది సెప్టెంబర్ లో ఆమెకు బెంగళూరు ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే బెయిల్ లభించింది. దాంతో అప్పటినుంచి జయ... అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు కనిపించలేదు. తాజాగా ఆస్తుల కేసులో జయ నిర్దోషి అంటూ కర్ణాటక హైకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పురచ్చితలైవి బయటికి రానున్నారు. ఆ రోజు పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్, డీఎంకే వ్యవస్థాపకులు సీఎన్ అన్నాదురై,డీకే వ్యవస్థాపకులు పెరియార్ ఈవీ రామస్వామి విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించనున్నట్టు అన్నా డీఎంకే ఓ ప్రకటనలో తెలిపింది. అదే రోజు ఉదయం 7 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలతో జయ సమావేశం నిర్వహిస్తారు. మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టనున్న క్రమంలో జయను పార్టీ నాయకురాలిగా ఎన్నుకునే అంశంపై చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News