: విజయవాడలో 5జి అందుబాటులోకి వచ్చింది!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 3జి, 4జిలతో పోలిస్తే ఈ విధానంలో మరింత వేగంగా డేటా ట్రాన్స్ ఫర్, డౌన్ లోడింగ్ సేవలను అందుకోవచ్చు. విజయవాడ నగరవాసులకు 5జి సేవలను అందించేలా 17 వైఫై పాయింట్లు ఏర్పాటయ్యాయి. ఒక్కో పాయింట్ నుంచి 400 మంది చొప్పున ఒకేసారి 6,800 మంది ఈ సేవలను వాడుకోవచ్చు. వైఫై సిగ్నల్ ను అందుకున్న తరువాత యూజర్ నేమ్, మొబైల్ నంబర్ నమోదు చేసుకొని పాస్ వర్డ్ పొందాలని, ఆపై దాన్ని ఉపయోగించి సేవలందుకోవచ్చని అధికారులు తెలిపారు. వినియోగదారులు తొలి 15 నిమిషాల పాటు ఈ సర్వీసును ఉచితంగా అందుకోవచ్చని, ఆపై స్క్రాచ్ కార్డు లేదా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు తదితర మార్గాలను ఉపయోగించి డేటాను కొనుగోలు చేయాల్సి వుంటుందని వివరించారు. కాగా, క్వాడ్జెన్, బీఎస్‌ఎన్‌ఎల్, ఏపీఎస్ ఆర్టీసీలు సంయుక్తంగా 5జి సేవలను మొదలు పెట్టాయి. అతి త్వరలో ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల బస్టాండుల్లో ఇవే తరహా సేవలను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాదులో 4జి సేవలే ఇంకా మొదలు కాని సంగతి తెలిసిందే.