: హైటెక్ పరికరాలతో అమ్మాయిల మాస్ కాపీయింగ్... 8 మంది అరెస్ట్
అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తూ హైటెక్ మాస్ కాపీయింగ్ చేస్తున్న వారు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. బీహార్ లో జరిగిన కంబైన్డ్ ఎంట్రెన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బోర్డ్ (బీసీఈసీఈబీ) పరీక్షల్లో భాగంగా వివిధ సెంటర్లలో ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అధికారులు అవాక్కయ్యేలా బ్లూ టూత్, స్కానర్ పెన్, మైక్రో ఫోన్ తదితర పరికరాలతో కాపీయింగ్ చేస్తున్న 8 మంది అమ్మాయిలు సహా 13 మంది కాపీలు కొడుతూ దొరికిపోయారు. ఈ తరహా ఘటనలు ఆంధ్రప్రదేశ్ లో నాలుగైదేళ్ల క్రితమే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ బీహారులో ఇంతమంది ఒకేసారి దొరకడం ఇదే తొలిసారి.