: రాజధానికి భూమి పూజ ఎక్కడనేది ఇంకా నిర్ణయించలేదు: సీఆర్ డీఏ కమిషనర్


జూన్ 6న రాజధానికి భూమి పూజ ఎక్కడనేది ఇంకా నిర్ణయం కాలేదని సీఆర్ డీఏ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. రాజధాని ప్రాంతంలో భూసేకరణకు గ్రామాల వారీగా వివరాలను సేకరించనున్నట్టు చెప్పారు. గుంటూరు నగరంలో ఈ రోజు ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కమిషనర్ శ్రీకాంత్, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, డిప్యూటీ కలెక్టర్లు హాజరయ్యారు. భూసమీకరణలోనూ రైతుల నుంచి భూములు తీసుకుంటామన్నారు. సామాజిక, ఆర్థిక సర్వేకు ఈ నెల 25 వరకు గడువు ఉందని, ఈలోగా నమోదులో లోపాలను సరిచేసుకోవాలని సూచించారు. చదును చేసిన భూముల్లో పంటలు వేయకుండా చూడాలని డిప్యూటీ కలెక్టర్లను కమిషనర్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News