: భారత మార్కెట్లో విడుదలైన 'చీపెస్ట్' ఆటోమేటిక్ కారు... రూ. 2.80 లక్షలకు టాటా 'జెన్ ఎక్స్ నానో'


ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ నానో సరికొత్త వర్షన్ 'జెన్ ఎక్స్ నానో' మార్కెట్లోకి విడుదలైంది. నానోకు ఆటోమేటిక్ వర్షన్ గా వచ్చిన ఈ కారు ధర రూ. 2.80 లక్షలని, మాన్యువల్ గేర్ ట్రాన్స్ మిషన్ తో లభించే కారు ధర రూ. 2.10 లక్షలని (ఎక్స్ షోరూం, ముంబై) సంస్థ వివరించింది. అతి తక్కువ ధరతో భారత్ లో లభించే ఆటోమేటిక్ వర్షన్ కారు ఇదేనని టాటా మోటార్స్ పేర్కొంది. కాగా, ప్రస్తుతం ఇండియాలో లభిస్తున్న లో ఎండ్ ఆటోమేటిక్ కారుగా మారుతి సుజుకి ఆల్టో కే10 (ధర రూ. 4.26 లక్షలు) కొనసాగుతూ, 'జెన్ ఎక్స్ నానో' రాకతో ఆ గుర్తింపును పోగొట్టుకుంది. తాము అవలంభించిన ఈజీ షిఫ్ట్ (ఏఎంటీ) సాంకేతికత, ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉండే పట్టణ ప్రాంతాల్లో కస్టమర్లకు కారును దగ్గరకు చేరుస్తుందని భావిస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఈ కారు అభివృద్ధికి రెండేళ్లు శ్రమించామని వివరించింది.

  • Loading...

More Telugu News