: నా మరణానికి కారణం ఓ డాక్టర్, బాలీవుడ్ లోని పెళ్లయిన మగాళ్లు!: శిఖా జోషి ఆఖరి మాట


బాలీవుడ్ నటి శిఖాజోషి (బీఏ పాస్ ఫేం) ఆత్మహత్య కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. గొంతు కోసుకొని ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకొన్న తరువాత, మరణించే ముందు శిఖా జోషి వాంగ్మూలాన్ని ఆమె స్నేహితురాలు, రూమ్ మేట్ అయిన మధు భారతి తన మొబైల్ ఫోన్ తో రికార్డ్ చేసింది. తన మరణానికి ఓ కాస్మెటిక్ సర్జన్, బాలీవుడ్ లోని పలువురు వివాహిత పురుషులు కారణమని ఆ రికార్డింగులో ఆమె ఆరోపించింది. ఇప్పుడు దీనిని పరిశీలిస్తున్న పోలీసులు, అందులోని స్వరం ఆమెదా? కాదా? అన్న విషయాన్ని శాస్త్రీయంగా నిర్థారించవలసి వుందని అన్నారు. కాగా, శిఖా నాలుగేళ్ల క్రితం ఇదే సర్జన్ పై వేధింపుల కేసు పెట్టింది. ఆపై రెండేళ్ల క్రితం ఆయన ఇంటిపై రాళ్లు విసిరి కేసులో ఇరుక్కొంది. ఆమె వద్ద ఇంటికి వెళ్లేందుకు కూడా డబ్బులు లేవని, ఢిల్లీకి వెళ్లేందుకు టిక్కెట్ డబ్బు కోసం సెల్ ఫోన్ అమ్మేందుకు సిద్ధపడిందని మధు వివరించారు. శిఖా ఆత్మహత్య సమయంలో తానొక్కదాన్నే ఉన్నందున ముందు జాగ్రత్తగా తనతో మాట్లాడి దీనిని రికార్డు చేసినట్టు ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News