: టీడీపీకి అంత సీన్ లేదన్న అంబటి
ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వాలపై వైకాపా నేత అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు... ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేకపోయారని విమర్శించారు. ఈ ఏడాది పాలనలో ఏం చేశారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని అన్నారు. ఏడాది పాలన పూర్తైన సందర్భంగా, విజయ యాత్రలు చేసుకునే హక్కు టీడీపీకి లేదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని అంబటి విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఏమీ చేయలేకపోయారని మండిపడ్డారు.