: ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పేదలకు ఇళ్లు కట్టిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను విద్యార్థులు దగ్ధం చేశారు. యూనివర్శిటీ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తానని ఇచ్చిన హామీని వెంటనే వెనక్కి తీసుకోవాలని అంతకుముందు ఓయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విశ్వవిద్యాలయ భూముల జోలికి వస్తే ఊరుకోమని కేసీఆర్ ను హెచ్చరించారు.