: రోడ్ సైడ్ భోజనం... పొలాల్లో రైతులతో మంతనాలు: అమేథీ పర్యటనలో రాహుల్ స్టైల్


సుదీర్ఘ సెలవు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలో పెద్ద మార్పే వచ్చింది. అంతకుముందు బయటకు అరుదుగా వచ్చే రాహుల్, ఆ తర్వాత బయటే ఎక్కువగా ఉంటున్నారు. అది కూడా జనాల మధ్యలోనే ఆయన నిత్యం గడుపుతున్నారు. వ్యవసాయం గురించి అంతగా తెలియకున్నా, రైతుల కష్టనష్టాలను ఆసక్తిగా వింటున్నారు. నిన్న తన సొంత నియోజకవర్గం అమేథీలో పర్యటించిన సందర్భంగా రాహుల్ గాంధీ నిజమైన పొలిటీషియన్ గా మారిపోయాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమేధీకి వెళ్లిన రాహుల్ గాంధీ నిన్న మధ్యాహ్నం భోజనాన్ని రోడ్డు పక్కగానే ముగించారు. అది కూడా తన కారుకు ఆనుకుని నిలబడే ఆయన భోజనం కానిచ్చేశారు. ఆ తర్వాత పొలాల్లో కింద కూర్చుని రైతులతో ముచ్చటించారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ జనంలోకి మరింతగా చొచ్చుకెళ్లడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News