: అంతమందిని ఫెయిల్ చేస్తారా?... గ్రేస్ మార్కులేసి పాస్ చెయ్యండి: కేసీఆర్ సర్కారుకు టీడీపీ డిమాండ్


కేసీఆర్ సర్కారు అనాలోచిత నిర్ణయాల కారణంగా పదో తరగతి పరీక్షల్లో లక్షలాది మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేకపోయారని, తక్షణమే గ్రేస్ మార్కులు కలిపి వారిని పాస్ చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. సీసీఈ విధానాన్ని విద్యా సంవత్సరం మధ్యలో చేర్చడం వల్ల అధ్యాపకులకే అవగాహన లేకపోయిందని టీడీపీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు. అందువల్లే మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో అత్యధికులు ఫెయిల్ అయ్యారని ఆయన అన్నారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ రెండు సబ్జెక్టుల్లో గ్రేస్ మార్కులు కలిపి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగం పట్ల సర్కారుకు అవగాహన లేదని, అందుకే అంతమంది ఫెయిల్ అయ్యారని ఆయన దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News