: మాకు సున్నా మార్కులేయడానికి రాహుల్ ఎవరు?: ఏపీ బీజేపీ కార్యదర్శి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వానికి సున్నా మార్కులేనంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్ డీఏ ప్రభుత్వానికి జీరో మార్కులేయడానికి రాహుల్ ఎవరు? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. దేశంలో 99 శాతం మంది ప్రజలు ఎన్ డీఏకు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. విదేశాలకు వెళ్లిన రాహుల్ అజ్ఞానంతో తిరిగొచ్చారని, రాజకీయ పరిపక్వత లేదని కోటేశ్వరరావు ధ్వజమెత్తారు.