: ఢిల్లీ పరిసరాల్లో ‘ఎర్ర’ స్మగ్లర్లు... బదానీ సమాచారంతో ఢిల్లీ వెళ్లిన కడప ఎస్పీ గులాటీ


ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్మగ్లర్ గా పేరుగాంచిన ముఖేశ్ బదానీని విచారించిన కడప జిల్లా పోలీసులకు కీలక సమాచారం అందిందట. దీంతో జిల్లా ఎస్పీ నవీన్ గులాటీ ఉన్నపళంగా ఢిల్లీ బయలుదేరారు. హర్యానాలో అరెస్టైన ముఖేశ్ బదానీని నిన్న పోలీసులు కడపకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో బదానీని కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు, దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఎర్రచందనం స్మగ్లర్లున్నారన్న సమాచారాన్ని రాబట్టారు. ఢిల్లీ కేంద్రంగా అక్రమ దందా బడా నేతల కనుసన్నల్లో సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో స్వయంగా ఎస్పీ గులాటీనే ఢిల్లీ బయలుదేరారు. రేపు సాయంత్రంలోగా ఢిల్లీలో కీలక వ్యక్తులు అరెస్టయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News