: ఏపీలో పాస్ పోర్టు తనిఖీలు ఐదు రోజుల్లో పూర్తి!
పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేశామనుకోండి. ఎన్ని రోజుల్లో చేతికందుతుందో తెలియని పరిస్థితి. అత్యవసరంగా కావాల్సిన వారు పాస్ పోర్టు కార్యాలయాల చుట్టు కాకుండా జిల్లా కేంద్రాల్లోని ఎస్పీ కార్యాలయాల చుట్టు తిరగాల్సిందే. అయితే ఏపీలో ఇకపై ఈ తరహా ఇబ్బందులకు చెక్ పెడతామంటున్నారు డీజీపీ రాముడు. తమకు అందిన పాస్ పోర్టు దరఖాస్తుల తనిఖీని ఐదంటే, ఐదు రోజుల్లోనే పూర్తి చేస్తామని ఆయన నిన్న మీడియాకు చెప్పారు. ఈ మేరకు పోలీసు సేవల్లో సమూల మార్పులు తీసుకురానున్నామని పేర్కొన్నారు. ఈ సంస్కరణలకు జూన్ ఫస్ట్ నుంచే నాంది పలకనున్నట్లు ఆయన వెల్లడించారు.