: అనుష్కతో మాట్లాడినందుకు కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్!


మ్యాచ్ సందర్భంగా తన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మతో మాట్లాడిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని బీసీసీఐ మందలించింది. అయితే ఇందులో మందలించడానికేముందనేగా మీ డౌటు! ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ జరుగుతుండగా, జట్టు సభ్యులు, ప్రత్యర్థి జట్టు సభ్యులు మినహా బయటి వ్యక్తులతో మాట్లాడేందుకు ఆటగాళ్లకు అనుమతి లేదు. మొన్న బెంగళూరులో ఢిల్లీతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోవడంతో డ్రెస్సింగ్ రూంకు వెళుతున్న క్రమంలో కోహ్లీ, అనుష్కతో మాట్లాడాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ, అతడికి వార్నింగిచ్చిందట. ‘‘చిన్నస్వామి స్టేడియంలో వీఐపీ ఎన్ క్లోజర్, ఆటగాళ్ల డగౌట్ దగ్గరగా ఉండటం వల్లే అనుష్కతో కోహ్లీ మాట్లాడగలిగాడు. విషయం తెలిసిన తర్వాత విరాట్ ను పిలిచి అనధికారికంగా వార్నింగిచ్చాను’’ అని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు.

  • Loading...

More Telugu News