: స్వచ్ఛ భారత్ పై నేడు సీఎంల సబ్ కమిటీ భేటీ...నేతృత్వం వహించనున్న చంద్రబాబు
'నీతి ఆయోగ్' సమావేశాల్లో భాగంగా నేడు స్వచ్ఛ భారత్ పై సీఎంల సబ్ కమిటీ భేటీ కానుంది. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి అధ్యక్షతన చండీగఢ్ లో జరగనున్న ఈ భేటీకి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. నిన్న సాయంత్రమే చంద్రబాబు ఢిల్లీ చేరుకోగా, మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా నమోదైన ప్రగతి, భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళికల రూపకల్పన తదితరాలపై సబ్ కమిటీ చర్చించనుంది.