: స్వీట్ హార్ట్... డార్లింగ్... అంతకన్నా ఎక్కువే: సూర్య


'రాక్షసుడు' ఆడియో ఫంక్షన్ లో హీరో సూర్య మాట్లాడాడు. మైక్ అందుకుని, తొలుత అభిమానులకు థాంక్స్ చెప్పాడు. తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపాడు. అనంతరం, ప్రభాస్ గురించి చెబుతూ... "అతను మీ స్వీట్ హార్ట్... మీ డార్లింగ్ అని తెలుసు. కానీ, అతను అంతకంటే ఎక్కువేనని చెబుతాను. రామోజీ ఫిలింసిటిలో బాహుబలి షూటింగ్ జరుగుతుండగా, మేం కూడా షూటింగ్ కోసం సిటీకి వచ్చాం. అప్పుడు ప్రభాస్ ఆతిథ్యాన్ని మర్చిపోలేను. తను నాపై ఎంతో శ్రద్ధ చూపాడు. మా షూటింగ్ రాత్రి పదకొండున్నరకు అయింది. తను నాకోసం అప్పటివరకు వెయిట్ చేశాడు. ఇంటి నుంచి తెప్పించిన బిర్యానీ తినిపించాడు. అది మామూలు బిర్యానీ కాదు. రొయ్యలు, చికెన్, మటన్... సూపర్ బిర్యానీ. అప్పుడు రానా కూడా మాతోనే ఉన్నాడు. అందరం బాగా ఎంజాయ్ చేశాం. రానా... నిన్ను ఇవాళ మిస్సయ్యాను. ఎనీవే థాంక్యూ ప్రభాస్" అని తెలిపాడు.

  • Loading...

More Telugu News