: 'రాక్షసుడు' ఆడియో లాంచ్ చేసిన ప్రభాస్
వెంకట్ ప్రభు దర్శకత్వంలో సూర్య, నయనతార, ప్రణీత నటించిన 'రాక్షసుడు' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఆడియోను ప్రభాస్ లాంచ్ చేశాడు. ఆడియో సీడీలను హీరో సూర్య వేదికపై ఉన్న అందరికీ అందించారు. అనంతరం, సూర్య, ప్రభాస్ మీడియాకు పోజులిచ్చారు. కాగా, ఈ కార్యక్రమానికి హీరోయిన్లు ఎవరూ హాజరుకాలేదు. రాక్షసుడు సినిమాకు యువన్ శంకర్ రాజా స్వరాలు కూర్చారు.