: 'రాక్షసుడు' ఆడియో వేడుకలో 'బాహుబలి'


సూర్య కొత్త సినిమా 'రాక్షసుడు' ఆడియో వేడుక హైదరాబాదు శిల్పకళావేదికలో జరుగుతోండగా, 'బాహుబలి' హీరో ప్రభాస్ విచ్చేశాడు. దీంతో, ఫ్యాన్స్ లో ఒక్కసారిగా ఉత్సాహం అంబరాన్నంటింది. ప్రభాస్ ఆడిటోరియంలోకి అడుగుపెట్టగానే, ఈలలు, కేకలతో అభిమానులు హోరెత్తించారు. ప్రభాస్ కు సూర్య ఎదురెళ్లి స్వాగతం పలికారు. సీట్లో కూర్చునే ముందు ప్రభాస్ చేయి ఊపి అభివాదం చేయడంతో ఫ్యాన్స్ మరోసారి హర్షధ్వనాలు చేశారు. ఈ ఆడియో వేడుకకు సీనియర్ డైరక్టర్ ఎ.కోదండరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News