: నేనింకా బతికే ఉన్నా: వదంతులపై స్పందించిన జాకీ చాన్
సోషల్ మీడియాలో ఏ విషయమైనా ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఊహాగానాలు, పుకార్లు ఇంకా వేగంగా ప్రయాణిస్తాయి. తాజాగా, మార్షల్ ఆర్ట్స్ హీరో జాకీ చాన్ చనిపోయాడంటూ ఇంటర్నెట్లో వదంతులు హల్ చల్ చేశాయి. కేన్స్ చిత్రోత్సవ కార్యక్రమాలతో బిజీగా ఉన్న జాకీ చాన్ కు ఈ పరిణామాలు దిగ్భ్రాంతి కలిగించాయి. దీంతో, ఆయన స్పందించక తప్పలేదు. తానింకా బతికే ఉన్నానని పేర్కొన్నారు. తనకేం కాలేదని, ఎవరూ బాధపడవద్దని అన్నారు. 'వీబో'లో వచ్చిన పుకార్లను నమ్మవద్దు అని సూచించారు. ఈ మేరకు తన అఫిషియల్ ఫేస్ బుక్ పేజ్ లో పోస్టు చేశారు.