: లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు


ఈరోజు భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొనుగోళ్లతో మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. ఈనాటి ట్రేడింగ్ ముగిసేసరికి... సెన్సెక్స్ 363 పాయింట్లు లాభపడి 27,687కి పెరిగింది. నిఫ్టీ 111 పాయింట్ల లాభంతో 8,374 వద్ద స్థిరపడింది. జైన్ ఇరిగేషన్, డెల్టా కార్పొరేషన్ లిమిటెడ్, అపోలో టైర్స్, సియట్ లిమిటెడ్ లు టాప్ గెయినర్స్ గా నిలిచాయి. నష్టపోయిన సంస్థల్లో ఎన్ సీసీ, దేనా బ్యాంక్, జైప్రకాశ్ పవర్, జమ్ము అండ్ కాశ్మీర్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి.

  • Loading...

More Telugu News