: సికింద్రాబాదుకు శస్త్రచికిత్స చేయాలంటున్న కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్టు అర్థమవుతోంది. మెట్టుగూడలో అధికారులతో కలిసి పర్యటించిన సందర్భంగా ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాదు నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో పర్యటించానని, పలు చోట్ల పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని తెలిపారు. సికింద్రాబాదుకు శస్త్రచికిత్స చేయాల్సి ఉందని, లేకుంటే, మరీ అధ్వానంగా తయారవుతుందని అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారానికి అందరూ శ్రమించాలని పిలుపునిచ్చారు. నగర పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు.

  • Loading...

More Telugu News