: ఇదిగో అవంతిక... అతిలోక సౌందర్యరాశి!
భారీ బడ్జెట్ తో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'బాహుబలి' ప్రచారాన్ని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తనదైన శైలిలో ముందుకు తీసుకెళుతున్నారు. సినిమాలోని ప్రధాన పాత్రధారుల ఫస్ట్ పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ, ప్రేక్షకుల్లోనూ, సినీ జనాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పలు పోస్టర్లు విడుదల చేసిన రాజమౌళి తాజాగా తమన్నా పోస్టర్ ను విడుదల చేశారు. 'అవంతిక... ద ఏంజెలిక్ అవెంజర్' అంటూ ఆ పాత్ర పేరిట ఓ పేజ్ క్రియేట్ చేశారు. ఇక, తమన్నా ఫొటో కింద "హర్ బ్యూటీ ఈజ్ ష్రౌడెడ్ ఇన్ మిస్టరీ!!!" అంటూ క్యాప్షన్ పెట్టారు.