: నయనతార, నేను పెళ్లి చేసుకోలేదు: దర్శకుడు శివం
దర్శకుడు శివంను ప్రముఖ నటి నయనతార పెళ్లి చేసుకుందంటూ ఇటీవల మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. వీరి వివాహం కొచ్చిన్ లోని చర్చిలో జరిగిందని... రహస్యంగా వీరు పెళ్లి చేసుకున్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ పెళ్లికి కేవలం కుటుంబసభ్యులు, కొంతమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే నయనతారతో తనకు వివాహం జరగలేదని... ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని శివం స్పష్టం చేశాడు. ఇలాంటి పుకార్ల వల్ల తమ ఇమేజ్ కు నష్టం వాటిల్లుతుందని ట్వీట్ చేశాడు.