: 'ఆప్' మహిళా కౌన్సిలర్ ను జుట్టుపట్టి లాక్కొచ్చి అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు!


ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ నిషా సింగ్ ను ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్ పోలీసులు జట్టు పట్టి బయటకు ఈడ్చుకొచ్చి కొట్టి మరీ అరెస్ట్ చేశారట. గూగుల్ సంస్థలో పనిచేస్తూ, ఆప్ విధానాలకు ఆకర్షితురాలై ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చిన నిషాను, శుక్రవారం నాడు హర్యానా అర్బన్ డెవలప్ పెంట్ అథారిటీ కార్యాలయం ముందు జరిగిన హింసాత్మక ఘటనలో సంబంధముందని ఆరోపిస్తూ, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసేముందు పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆప్ కార్యకర్తలు ఆరోపించారు. శుక్రవారం నాటి ఘర్షణల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలున్నా వారిని చూసీ చూడనట్టు వదిలివేశారని, తనకు తగిలిన గాయాలకు నిషా సింగ్ చికిత్స చేయించుకుని ఆసుపత్రి నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారని, పోలీసులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ అల్లర్ల కేసులో నిషాతో పాటు మరో 9 మంది మహిళలపైనా హత్యాయత్నం కేసులను పోలీసులు పెట్టారు. అరెస్టు అనంతరం నిషాను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా, రిమాండ్ విధించడంతో ఆమెను భోండ్సీ జైలుకు తరలించారు. గత సంవత్సరం ఆప్ లో చేరిన నిషా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ విద్యను అభ్యసించారు.

  • Loading...

More Telugu News