: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: ఏఐసీసీ డిమాండ్


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) గళమెత్తింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించిందని... దానికి ఎన్డీఏ కూడా మద్దతు ప్రకటించిందని... ఇప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎన్డీఏపై ఉందని ఏఐసీసీ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై ఎంతకాలం వేచి చూడాలని ప్రశ్నించారు. దాన్ని యూపీఏ నిర్ణయంగా భావించి తప్పుకోవాలని చూడరాదని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News