: జూన్ 6 ఉదయం 8.49 గంటలు... నవ్యాంధ్ర రాజధానికి శంకుస్థాపన
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి పునాది రాయి పడుతోంది. గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో కొత్తగా ఏర్పాటు కానున్న రాజధానికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అమరావతిగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తి కాగా, మాస్టర్ ప్లాన్ కూడా తుది రూపు దిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్త రాజధాని నిర్మాణం శంకుస్థాపనకు చంద్రబాబు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. జూన్ నెల 6న ఉదయం 8.49 గంటలకు రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.