: తొమ్మిదేళ్లకే ‘టెన్త్’లో డిస్టింక్షన్... తెలంగాణ ‘పది’ ఫలితాల్లో బుడతడి రికార్డు!


పిట్ట కొంచెం... కూత ఘనమంటే ఇదేనేమో. వయసు ఇంకా పదేళ్లు కూడా దాటలేదు, అప్పుడే ఆ బుడతడు ‘పది’లో ఉత్తీర్ణత సాధించాడు. అంతేనా, రెగ్యులర్ విద్యార్ధుల్లో కొంతమందికి మాత్రమే సాధ్యమయ్యే డిస్టింక్షన్ కూడా సాధించాడు. అతడే తొమ్మిదేళ్ల అగస్త్య జైస్వాల్. హైదరాబాదు పరిధిలోని కాచిగూడకు చెందిన అశ్వినీ కుమార్, భాగ్యలక్ష్మిల కొడుకు అగస్త్య నిన్న వెలువడ్డ తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ లో 7.5 పాయింట్లతో పాసయ్యాడు. తద్వారా టెన్త్ లో బాలుర విభాగంలో అతిపిన్న వయసులో టెన్త్ పూర్తి చేసినవాడిగా అగస్త్య రికార్డు నెలకొల్పాడు. అంటే, అమ్మాయిల విభాగంలో అతడి కంటే చిన్న వయసులోనే టెన్త్ నెగ్గారా? అనేగా మీ డౌటు. నిజమేనండోయ్, ఎనిమిదేళ్లకే ఓ చిన్నారి బాలిక టెన్త్ పాసైంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, అగస్త్య సోదరి, ప్రముఖ టీటీ ప్లేయర్ నైనా జైస్వాలేనట. ఆమె ఎనిమిదేళ్ల వయసులోనే టెన్త్ పాసై ఔరా అనిపించింది.

  • Loading...

More Telugu News