: టీఎస్ మంత్రి ఈటెలకు తప్పిన ముప్పు
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు పెను ముప్పు తప్పింది. హుజూరాబాద్ నుంచి వెంకట్రావ్ పల్లికి ఆయన వెళుతుండగా... కాన్వాయ్ లోని బుల్లెట్ ప్రూఫ్ కారు రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ ఘటన మెట్ పల్లి గ్రామ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసమయింది. సాధారణంగా ఈ కారులోనే ప్రయాణించే మంత్రి ఈటెల... ప్రమాద సమయంలో మాత్రం ఆ కారులో లేరు. కాన్వాయ్ లోని వేరే వాహనంలో ఆయన ఉన్నారు. దీంతో, ఆయనకు పెను ప్రమాదం తప్పింది. కారు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.