: నువ్వు తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ వల్లే!: కేసీఆర్ కు షాకిచ్చిన పార్శిగుట్ట స్వామి


తెలంగాణ సీఎం కేసీఆర్ కు నిన్న స్వచ్ఛ హైదరాబాదులో భాగంగా గట్టి షాక్ తగిలింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడానికి తాను, తన పోరాట పటిమే కారణమని చెప్పుకుంటూ వస్తున్న కేసీఆర్ కు సికింద్రాబాదు పరిధిలోని పార్శిగుట్టకు చెందిన స్వామి అనే వృద్ధుడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన కారణాలు, ప్రధాన హేతువును ముఖం మీదే చెప్పేశాడు. స్వచ్ఛ హైదరాబాదులో భాగంగా నిన్న పార్శిగుట్ట వచ్చిన కేసీఆర్, అక్కడి వృద్ధులతో సమావేశమయ్యారు. వృద్ధుల్లో ఒకరిగా కూర్చున్న స్వామిని మాట్లాడాలని కేసీఆర్ మైకిచ్చారు. మైకందుకున్న స్వామి ఒక్కసారిగా గొంతు సవరించుకుని ‘‘తెలంగాణ కోసం ఉద్యమాలు జరిగింది వాస్తవం. కానీ, రాష్ట్రం ఇచ్చింది మాత్రం కాంగ్రెస్సే. నువ్వు తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ వల్లనే. సోనియా గాంధీ పట్టుదలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది’’ అని కుండబద్దలు కొట్టారు. స్వామి వ్యాఖ్యలకు కేసీఆర్ ఏమాత్రం స్పందించక సైలెంట్ గా కూర్చుండిపోయారు. ఆ తర్వాత మళ్లీ స్వామి మాట్లాడుతూ ఇందిరాగాంధీ హయాంలోనే తాను కాంగ్రెస్ లో చేరానని, నాటి నుంచి కాంగ్రెస్ లోనే ఉంటున్నానని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News