: రికార్డు స్థాయిలో భక్తులకు శ్రీవారి దర్శనం!


భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించే విషయంలో టీటీడీ సరికొత్త రికార్డును నెలకొల్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల మార్చిన దర్శన విధానమే ఇందుకు కారణం. శనివారం అర్ధరాత్రి సమయానికి 90 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలో ఎన్నడూ ఒక రోజు వ్యవధిలో ఇంత భారీ సంఖ్యలో భక్తులకు స్వామి దర్శనం లభించలేదు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన కూడా ఈ స్థాయిలో భక్తులు స్వామిని చూడలేకపోయారు. బంగారు వాకిలి నుంచి మూడు వరుసల్లో దర్శనానికి ఏర్పాట్లు చేయడం వల్లే ఈ రికార్డు నమోదైందని అధికారులు తెలిపారు. కాగా, వీఐపీ దర్శనాలను రద్దు చేసిన పక్షంలో లక్ష మంది రికార్డును అందుకోవడం సాధ్యమేనని తెలుస్తోంది. స్వామివారి దర్శనానికి శనివారం నాడు వచ్చిన భక్తులతో పోలిస్తే ఆదివారం నాడు రద్దీ కొంత తగ్గింది.

  • Loading...

More Telugu News