: కోహ్లీకి మద్దతుగా వెళ్లి జరిమానాకు గురైన దినేశ్ కార్తీక్


బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అనవసరంగా జరిమానాకు గురయ్యాడు. శుక్రవారం హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాదుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. జోరుగా వర్షం కురుస్తున్నా మ్యాచ్ ను కొనసాగిస్తున్న అంపైర్ తీరుపై కోహ్లీ మండిపడ్డాడు. అప్పటిదాకా అక్కడికి దూరంగా ఉన్న దినేశ్ కార్తీక్ ఒక్కసారిగా కోహ్లీ వద్దకు వచ్చి, అంపైర్ తో వాదనకు దిగాడు. ఈ విషయం వివాదాస్పదమైంది. దీనిపై బీసీసీఐ విచారణ చేపట్టింది. విచారణలో కోహ్లీని తప్పుబట్టని బీసీసీఐ, దినేశ్ మాత్రం అంపైర్ పై అనుచితంగా ప్రవర్తించాడని తేల్చింది. లెవెల్ 1 నిబంధనలను దినేశ్ అతిక్రమించాడని భావించింది. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతానికి కోత పెట్టింది. గొడవ మొదలుపెట్టిన కోహ్లీని వదిలేసి, అతడికి మద్దతుగా వెళ్లిన దినేశ్ కు జరిమానా పడటం విశేషం.

  • Loading...

More Telugu News