: దనుష్ ముందు నేను దిగదుడుపే: సోనమ్ కపూర్
తమిళ నటుడు దనుష్ సరసన నటనలో తాను తేలిపోతున్నానని ఒప్పుకుంది బాలీవుడ్ తార సోనమ్ కపూర్. వీరిద్దరూ జంటగా హిందీలో 'రాంజ్ నా' అనే సినిమా తెరకెక్కుతోంది. 'దనుష్ పక్కన నటించలేకపోతున్నాను. ఆయన సరసన నటిస్తుంటే నాకు ఇప్పుడే సినిమాల్లోకి వచ్చినట్టు అనిపిస్తోంది. దనుష్ అంత గొప్ప నటుడు. నా నటన ఆయన ముందు తేలిపోతోంది' అంటూ అంగీకరించింది సోనమ్.