: క్వార్టర్ బాటిల్ కాటేసింది!


హైదరాబాదులో క్వార్టర్ బాటిల్ ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొంది. వివరాల్లోకెళితే... జగద్గిరిగుట్టకు చెందిన మల్లేశ్ అనే తాపీ మేస్త్రీ శనివారం నాడు మోతాదుకు మించి మద్యం సేవించాడు. నడవడం కూడా కష్టమైన స్థితిలో మరో క్వార్టర్ బాటిల్ కొనుగోలు చేసి ఇంటికి బయల్దేరాడు. అప్పటికే మద్యం నిషా బాగా తలకెక్కింది. దీంతో, అడుగులు సరిగా పడక తూలి ముందుకు పడిపోయాడు. మల్లేశ్ తాను కొనుగోలు చేసిన క్వార్టర్ బాటిల్ ను జేబులో కాకుండా, బొడ్డు వద్ద పెట్టుకోవడం ప్రమాదానికి దారితీసింది. కిందపడిపోవడంతో ఆ సీసా పగిలిపోయింది. పదునైన ఆ గాజు పెంకులు కాస్తా మర్మాంగాన్ని గాయపర్చాయి. దీంతో, అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కుటుంబంలో విషాదం నింపుతూ చివరికి ప్రాణాలు విడిచాడు.

  • Loading...

More Telugu News